నీటిమాటలు-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చిరుజల్లులల్లో
చిందులేస్తా
చిన్నపిల్లాడిలా
చినుకుల్లోతడుస్తా

పిల్లకాలువల్లో
పడవలేస్తా
పసిపాపలతో
పరుగులుతీస్తా

నదిలో
మునుగుతా
పాపాలను
ప్రక్షాళనచేసుకుంటా

ఏటికి
ఎదురీదుతా
దమ్మున్నవాడినని
డబ్బాకొట్టుకుంటా

చెరువుల్లో
ఈతకొడతా
వడగాల్పులనుండి
రక్షించుకుంటా

తలంటుకోని
స్నానంచేస్తా
కల్మషాన్ని
కడిగేసుకుంటా

సముద్రంలో
దిగుతా
అలలపై
తేలియాడుతా

నీళ్ళను
త్రాగుతా
ప్రాణాలను
కాపాడుకుంటా

వర్షాలు
కురిపిస్తా
పంటలను
పండిస్తా

వానజల్లులు
చల్లిస్తా
వంటిని
తడిపేస్తా

గాలివానను
కురిపిస్తా
వరదలను
పారిస్తా

సెలయేర్లను
పారిస్తా
సంతసాలను
కూరుస్తా

నీటిమాటలు
చెబుతా
మాటలమూటలు
కట్టేస్తా

మాటలు
వినండి
మూటలు
కట్టుకోండి

మదుల్లో
దాచుకోండి
మరచిపోకుండా
మురిసిపోండి


కామెంట్‌లు