స్నేహ బంధం-- సి.హెచ్.ప్రతాప్
 నిజమైన స్నేహం అనేది ధృఢమైన ఆరోగ్యం వంటిది, పోగోట్టుకున్నాక గాని దాని విలువ మనకు అర్ధం కాదు.నా స్నేహితులే నా సమస్తం,ప్రపంచం,ఐశ్వర్యం,జీవన పరమార్ధం.
.
ప్రపంచమంతా నిన్నొదిలి వదిలి ఒంటరిని చేసి వెళ్ళిపోయినప్పుడు నీ చెంత నిలబడి, అక్కున చేర్చుకొని అభయం ఇచ్చి, కన్నీరు తుడిచేవాడే నిజమైన స్నేహితుడు.నీ హృదయం లో పలికే అనురాగపూరిత ,స్నేహమయ సంగీతాన్ని అర్ధం చేసుకొని,ఆస్వాదిస్తూ, నువ్వు మర్చిపోయి,మాటల కోసం తడబడుతున్నప్పుడు,అందుకునేవాడే నిజమైన స్నేహితుడు.
నిన్ను నువ్వు నమ్మడం మానేసాక కూడా నిన్ను నమ్మేవాడే నిజమైన స్నేహితుడు.ప్రేమతో కూడిన ఆలింగనం లక్ష మాటల కంటే గొప్పది. స్నేహితుడు అంతకంటే గొప్పవాడు.మనలో ఎంతమంది నిజమైన స్నేహితులుగా వున్నామో,ఎంతమందికి నిజమైన స్నేహితులు వున్నారో ఆత్మ పరిశీలన చేసుకుందాం.
నా ముందు నడవకు ఎందుకంటే నిన్ను అనుసరించలేను. నా వెనుక  నడవకు, నేను గమ్యం చూపలేను. నా పక్కనే నా చేతిలో చేయి వేసి నడువు ఎందుకంటే నాతో పాటు జీఇతాంతం కలిసి నడిచే నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నీ గురించి సర్వం తెలిసినా నిన్ను సర్వా కాల సర్వావస్థలయందు ప్రేమించేవాడే స్నేహితుడు. కొత్త స్నేహితులను సంపాదించుకో, కాని పాత స్నేహితులను మాత్రం విడువకు ఎందుకంటే ఒల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్రసిద్ధి. స్నేహం అంటే రెండు శరీరాలలో వుండే ఒకే ఆత్మ.
మనలకు జీవితాంతం తోడుగా వుండేందుకు,ఈ అనంత విశ్వం లో  మనకొక ఉనికి కల్పించి ఆనందానిచ్చేందుకు భగవంతుడు పంపించిన దూతలే స్నేహితులు.

కామెంట్‌లు