'ఆధునిక తెలుగు సాహిత్య సంస్థలు' ఆవిష్కరణ


 సీనియర్ జర్నలిస్టు,రచయిత టివిఆర్ కృష్ణ 'ఆధునిక తెలుగు సాహిత్య సంస్థలు' పరిశోధన గ్రంథం ఆవిష్కరణ  హైదరాబాద్ బుక్ ఫేయిర్ లో రవ్వా శ్రీహరి వేదికపై  జరిగింది.ఈ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అంచనా వేసేందుకు సాహిత్యమే ప్రాణంగా ఈ నేలపై ఎందరో విశేషకృషి చేశారని  ఈ సభ హాజరైన వక్తలు, పలువురు సాహితీవేత్తలు అన్నారు.ఆధునిక తెలుగు సాహిత్య సంస్థలు పుస్తకాన్నిఆవిష్కరించిన విశ్రాంత అధ్యాపకులు మోత్కూరి నరహరి ప్రసంగిస్తూ సామాజిక వికాసానికి మానవ చైతన్యానికి సాహిత్య సంస్థలు గత శతాబ్దకాలంగా ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు.మరో అతిథి ఎమ్మెస్కో ఎడిటర్ డి.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సాహితీ సంస్థలు కొన్ని రాజకీయ సిధ్ధాంతాలతో మరికొన్ని ఉద్యమ నేపథ్యంతో ఇంకా కొన్ని సాధారణ సంస్థలుగా విశేష కృషి చేశాయని వివరించారు.'ఆంధ్రజ్యోతి' ఎడిటర్ కె.శ్రీనివాస్ ప్రసంగిస్తూ తెలంగాణ  సాహిత్య చరిత్ర తెలుసుకోవాలంటే విజ్ఞాన చంద్రకా మండలి నుంచి విరసం వరకు, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నుండి తెలంగాణ రచయితల సంఘం వరకు సాహిత్య సంస్థల చరిత్రను  స్పృశించాలన్నారు.రచయిత  ప్రయత్నాన్ని ప్రశంసించారు.ఈ సభలో పాల్గొన్న ప్రముఖ కవులు నాళేశ్వరం శంకరం, రాపోలు సుదర్శన్, జూలూరు గౌరీశంకర్, ప్రొఫెసర్ లలితాదేవి, ఇంకా ఇతర వక్తలు, మిత్రులు  రచయిత టి.వి.ఆర్.కృష్ణ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇలా మరిన్ని గ్రంథాలు రచించాలని అభిలషిస్తూ తమ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Great bhai!!! Congrats Rama krishna gaaru...you famiky seems totally literary and noble.Salutes.