భవ్యము;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కమనీయ రమణీయ శ్రీహరి
పాదపద్మము సేవలోన  గడిపెడి భాగ్యము
అవిజ్ఞేయ సంచిత పుణ్య
పురోగామికే కాదు
విధివంచితునకు
శమ దమాదులకు ఓర్వని
సాధువైనగాని ఎవనికైన
ఖసూచి సుముఖపాపి
కదలజాలని వియోగియైన
కనుల జూడనైన లేనివాని
కడు జాగర్త లేకున్నవాడైనగాని
కవనమందున హరికీర్తన లేనివాడైన
కనరాని మతిలేని కూసుడైన
అజగరశాయి శంఖచక్రగదా ధారి
నభశ్చర వాహనుని స్మరణము జేసినంతనే
భవుకము కలుగు వినుడి
కడు భవ్యము నాదువాక్కు సదా!!!

{అవిజ్ఞేయ=తెలియరానిది; ఖసూచి=ప్రతిభలేనివాడు; 
కూసుడు= నీచమైనవాడు; 
అజగరశాయి=పెద్దపాముపై శయనించినవాడు 
(శ్రీమహావిష్ణువు); నభశ్చరుడు=గరుడుడు;
భవుకము=శుభము; భవ్యము=సత్యము}
**************************************

కామెంట్‌లు