సజ్జన సాంగత్యం ఎంతో శ్రేష్టం;సి.హెచ్.ప్రతాప్

 మనం నిత్య జీవితం లోచేసే సాంగత్యం పై మన జీవితం, మన ఉన్నతి అధారపడి వుంటాయి.అది మన మనస్సులను, భవిష్యత్తును మన ఆత్మను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దుర్జనుల సాంగత్యం లో మనకు దురలవాట్లు అబ్బుతాయి. వారితో కలిసి ఎన్నో పాప కార్యాలను చేస్తాం. తిరిగి వాటిని మనమే అనుభవిస్తూ అంతులేని దూఖాన్ని పోగుచేసుకుంటాము. సజ్జన సాంగత్యం మన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ పంధాన నడవక పోతే  పాప కార్యాల పంకిలంలో పడి  చేసిన కర్మల తాలూకూ ఫలితాన్ని అనుభవించడానికి ఎన్ని జన్మలైనా  జనన మరణ చక్రభ్రమణంలో కొట్టు మిట్టాడుతునే వుంటాము. అందుకే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక సద్గురువును ఆశ్రయించడం ఎంతో అవశ్యం. వారు మనకు జీవన్ముక్తిని సాధించే మార్గాన్ని చూపిస్తారు. ఆందువలన ఆత్మ జ్ఞానాన్ని మనకై మనం వెతుక్కోవల్సిన పని లేదు. సద్గురువులకు త్రికరణ శుద్ధిగా సర్వశ్య శరణాగతి చేస్తే చాలు. సజ్జన సాంగత్యం” అంటే సత్యం తెలుసుకున్న జనులతో కలవడం, సజ్జన సాంగత్యం అంటే జ్ఞానుల ద్వారా సత్యప్రవచనాలు వినడం, సజ్జన సాంగత్యం అంటే యోగుల ద్వారా ధ్యానానుభవాలు వినడం. శ్రీ ఆదిశంకరాచార్యులవారు “భజగోవిందం” లో “త్రిజగతి సజ్జన సంగేతిరేకా భవతి భవార్ణవ తరణే నౌకా” అన్నారు  అంటే మూడు లోకాల్లో కూడా ఏ లోకానికి పోయినా, యోగులతో కలవాల్సిందే. ఆ విధంగా పొందిన జ్ఞానసాగరమే మనల్ని తరింపచేయగలదు” అని. ఇది మనందరికీ ఎంతో శ్రేయోదాయకం. గంగా నది పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం పేదరికాన్ని పోగొడతాయి.  మహాపురుషుల, సత్పురుషుల ఆశ్రయం, దర్శనం ఈ మూడింటినీ పోగొడతాయనిశాశ్త్రాలు చెబుతున్నాయి. భగవంతుని ప్రేమకు అందరూ అర్హులే. కానీ, మానవునికి విశ్వాసం తక్కువ. అందుకే భగవంతుని నామస్మరణకు దూరమై, కష్టాలపాలవుతున్నాడు. ఆత్మవిశ్వాసం, సత్పురుష సాంగత్యం, భగవంతునిపైకి దృష్టిని మరలుస్తాయి.
కామెంట్‌లు