సౌందర్య లహరి;-కొప్పరపు తాయారు
 శ్రీ శంకరాచార్య విరచిత 🪷

పదన్యాసక్రీడాపరిచయమివారబ్ధుమనసః
స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి ।
అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణిత-
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే ॥ 91 ॥

గతాస్తే మంచత్వం ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః
శివః స్వచ్ఛచ్ఛాయాఘటితకపటప్రచ్ఛదపటః ।
త్వదీయానాం భాసాం ప్రతిఫలనరాగారుణతయా
శరీరీ హశృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ ॥ 92!
91) అమ్మా! మనోహరమైన చరిత్ర కలిగిన ఓ తల్లీ !
నీవు నడుచుచున్నప్పుడు నీ పాదములు మనోహరమైన లయను నేర్చుకున్నవలెనని నీ పెంపుడు హంసలు తొట్రిపాటు విడువకున్నవి. నీ బాధపదముల అందల శబ్దములు వాటికి పాఠం చెబుతున్నట్లుగా ఉన్నది కదా ! తల్లీ!
92)
     అమ్మా! దేవీ! బ్రహ్మ విష్ణు వు రుద్ర ఈశ్వరులు అను వేల్పులు నీకు మంచత్వమును పొంది ఉండగా కప్పుకొని దుప్పటి లాగున ఉన్న సదాశివతత్వము ఎల్లన్ని కాంతులు కలిగి నీకు ఆనందము కలుగ చేయు చున్నది కదా! తల్లీ!
                    ****🌟****
🌟 తాయారు 🪷

కామెంట్‌లు