సౌందర్య లహరి; కొప్పరపు తాయారు
 🌟శ్రీ శంకరాచార్య విరచిత 🌟

స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణామాసీదతిరసతయా చంచుజడిమా ।
అతస్తే శీతాంశోరమృతలహరీమమ్లరుచయః
పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజికధియా ॥ 63 ॥

అవిశ్రాంతం పత్యుర్గుణగణకథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా ।
యదగ్రాసీనాయాః స్ఫటికదృషదచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా ॥ 64 
63) అమ్మా! చంద్ర మనోహరమైన నీ ముఖము నుండి మందహాసములు వెన్నెల కంటే మధురమై ప్రవహిస్తున్నవి. ఆ వెన్నెలను తాగి బతికే చెకోర పక్షులు మిక్కిలి మధురములైన నీ దరహాస చంద్రికలు తాగి ఋతు బేధానికి, చంద్రుడు వెన్నెలను
త్రాగుచున్నవి . అమ్మా! ఆ చిరునవ్వు వెన్నెలను తాగి
బ్రతికే చెకోర పక్షులు చంద్రుడి వెన్నెల పుల్లనై తీపి తిన్నవారికి ఋతుమార్గం కోసం పులుపు ఇష్టమైనట్టు వారికి చంద్రుని వెన్నెల ఇష్టమవుతుంది అమ్మా !నీ మోము చంద్రుని కంటే నీ చిరునవ్వు వెన్నెల కంటే మధుర మనోహరంగా ఉంది కదా తల్లీ!
64)
       అమ్మా ! తల్లీ! నీ యొక్క నాలికనుండి ఎల్లప్పుడూ జపరూపముగా వచ్చు నీ భర్త అయినటువంటి పరమశివుని నిజ పుష్పములతో
నీ నాలుక చివరి భాగంలో శుద్ధ స్పటికం రంగు గలుగునట్టి సరస్వతి దేవి కూడా ప్రకాశిస్తున్నది కదా!

                       ***🌟****
🌟 తాయారు 🪷

కామెంట్‌లు