అబ్రహాం లింకన్ లేఖ! అచ్యుతుని రాజ్యశ్రీ

 అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చాడు.ఆయన తన కొడుకు కి చదువు చెప్పే అధ్యాపకునికి రాసిన లేఖ అందరికీ ఆదర్శం."మా అబ్బాయికి అంతా మంచి అంతా చెడు ఉండదని మనుషుల్లో మంచివారు హితులు ఉంటారని అలాగే మోసగాళ్ళు ఉంటారని వివరించండి.డబ్బు విలువ బాగా తెలిసేలా బోధించండి. బాల్యం లోనే పైసాపైసా కూడబెట్టి సద్వినియోగం చేయాలి.జల్సాలకు దూరం గా ఉండాలి.పైసామే హై పరమాత్మ అనేది పిల్లలకి తెలియాలి.ప్రశాంతంగా నవ్వుతూ  తృళ్లుతూ ఉండాలి.పాజిటివ్ గా ఆలోచించి చిన్న చితకకి తోటివారిపై ధాంధూం అనకుండా చూడండి.ఎవరేమన్నా టేకిట్ ఈజీ పాలసీ రెచ్చగొట్టితే జవాబు ఇవ్వకుండా దూరం గా తొలిగిపోయేలా చూడండి.ప్రకృతి అందాలు చూడమని ఒంటరిగా ఆలోచించటం నేర్పండి.మందలో ఒక గొర్రెలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను గుర్తింపుతెచ్చుకోవాలి.వ్యక్తిత్వం నీతి నిజాయితీని డబ్బు అవినీతికి దాసోహం కాకుండా చూసుకోవాలి అని తెలియజేయండి.ప్రేమగా చూడండి కానీ అతి గారాబం ముద్దు వద్దు.ఇదే మీకు నా విన్నపం." నిజంగా ఇది ప్రతి తల్లి తండ్రి ఆలోచించి ఆచరణలో పెడితే చాలు 🌷
కామెంట్‌లు