పుష్పా!!!;- ప్రతాప్ కౌటిళ్యా
పోయిన వాళ్ళ వెంట పోతే
పొద్దు మూకుతుంది!!!
ఉన్నవాళ్ల వెంట ఉంటే
పొద్దు పొడుస్తుంది.!!!!!

పోయిన వాళ్ళ పిలుపు వింటే
మాట పడిపోతుంది.!!!
ఉన్నవాళ్ల పిలుపు వింటే
మాట పుడుతుంది.!!!!!

శ్వాసతో పుడతాం!!
ఆశతో పుడతాం!!
ఆకలితో పుడతాం!
కలలతో పుడతాం!!!

భయంతో బ్రతుకుతాం
భ్రమలతో బ్రతుకుతాం
నమ్మకంతో బ్రతకాలి!!
ప్రశ్న లాగా బ్రతకాలి!!!!

ఆకాశం ఆవేశం ఒకటే
నిరాశ నిస్పృహ ఒకటే

అవమానం దిగ మింగితే చాలు!!
ఆత్మసంతృప్తి ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.!!

ప్రాణం-ప్రేమ
ఒకేసారి పుడుతుంది.
కానీ మళ్లీ మళ్లీ మరణిస్తుంది.!!?

మనల్ని మనం మర్చిపోదాం
గెలుపైనా ఓటమైనా నేర్చుకుందాం!!
కానీ మళ్లీ మళ్లీ జన్మిద్దాం!!!!

పాలెం విద్యార్థిని పుష్పలత స్మృతిలో


కామెంట్‌లు