పుస్తక పఠనం తో వ్యక్తిత్వ వికాసం


 +++++++++++
ముల్కనూరు ప్రజా గ్రంధాలయానికి 250 పుస్తకాల 
విరాళం అందించిన వారాల ఆనంద్ 
++++++++++++++ 
ఆధునిక సాంకేతికత ఎంతగా అభివృద్ది జరిగినప్పటికీ పుస్తకాల్ని చదవడం ద్వారానే 
సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని కవి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత 
వారాల ఆనంద్ అన్నారు. ఆయన శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ‘ప్రజా గ్రంధాలయానికి 250 పుస్తకాలని విరాళంగా అందజేశారు. ఆ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎంతగా ఎదిగినప్పటికీ సాటి మనిషిని ప్రేమించే గుణం, సమాజాన్ని అర్థం చేసుకునే శక్తి కేవలం ఉత్తమ పుస్తకాలు చదవడం తోటే లభిస్తుంది అన్నారు. ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థల విజయాల వెనుక సాంకేతిక పరిజ్ఞానం తో పాటు అధ్యయనం ప్రధాన పాత్ర పోషించింది అన్నారు. పోటీ పరీక్షల అధ్యయనం తో పాటు సాహిత్య పరిచయం యువకులకు విజయం సాధించడానికి     ఎంతగానో తోడ్పడుతుంది అన్నారు. ఈ సందర్భంగా వారాల ఆనంద్ ముల్కనూరు గ్రంధాలయానికి సుమారు 20 వేల రూపాయల విలువయిన అరుదయిన సాహిత్య, చరిత్ర పుస్తకాలని అందజేశారు. వాటితో పాటు తాను రచించిన మనిషి లోపల,అక్షరాల చెలిమే లాంటి 12 పుస్తకాల్ని కూడా వారాల ఆనంద్ అందజేశారు. పుస్తకాల్ని స్వీకరించిన గ్రంధాలయ కార్యదర్శి గొల్లపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ముల్కనూరు గ్రంధాలయం స్వచ్ఛందంగా సేవా భావంతో నడుపుతున్నామని వారాల ఆనంద్ లాంటి కవులురచయితల సహకారం అభినంద్నీయమని అన్నారు. సంస్థ బాధ్యుడు లెక్చరర్ డాక్టర్ ఏదులాపురం తిరుపతి, డాక్టర్ తాళ్ల వేరేశం, మెట్టు సుగందర్ రావు, శ్రీమతి ఇందిరా రాణి, శ్రీమతి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ముల్కనూరు గ్రంధాలయం చేస్తున్న సేవని ప్రశంసించారు.
కామెంట్‌లు