శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
266)దుర్ధరః -

లోకములను ధరించినవాడు
ధరణికి ఉద్ధారకుడైనవాడు
మోయలేనిభారం మోయువాడు 
అతిసామర్ధ్యమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
267)వాగ్మీ-

వేదజ్ఞానమునిచ్చుచున్నవాడు
జ్ఞానము వెలువరించువాడు
వాక్కును వెలిగించువాడు
సద్విషయములు తెలుపువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
268)మహేంద్రః -

ఇంద్రునికే ప్రభువైనవాడు
దేవతలనాజ్ఞాపించగలవాడు
శిఖరసమానుడైనట్టివాడు
ఇంద్రులలో ఘనమైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
269)వసుధః -

సకాలంలో బ్రోచునట్టివాడు
మహివలే వృద్ధినిచ్చెడివాడు
ఎన్నటికీ నిలిచియున్నవాడు 
నింగిని ఆకర్షించునట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు
270)వసుః -

తానిచ్చుధనము తానైనవాడు
అగ్నివలే పవిత్రుడైనవాడు
అష్టవసువులరూపమున్నవాడు 
గణదేవతలలో అధిపుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు