శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
276)ప్రకాశాత్మా-

తేజోమయ స్వరూపమున్నవాడు
కాంతివలయంలో నున్నట్టివాడు
ఆత్మను ప్రకాశింపజేయువాడు
దివ్యాత్మను కలిగియున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
277)ప్రతాపనః -

సూర్యరూపంలో వున్నవాడు
తపింపజేయునట్టివాడు
అగ్ని వేడిమి తానైనవాడు
భరించలేని తేజోవంతుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
278)బుద్ధః -

 ధర్మముకు నిలయమైనవాడు
జ్ఞానం ప్రసాదించగలవాడు
వైరాగ్యమును కలిగించువాడు
సమస్థితిని ఇచ్చునట్టివాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
279)స్పష్టాక్షరః -

ఓం నుండి ధ్వనించినవాడు
అక్షరముతో తెలియబడువాడు
దివ్యాక్షరము తానైనవాడు
ఓం తో సూచించబడినవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
280) -మంత్రః -

వేదమంత్రముల వంటివాడు
వేదముచే తెలియదగినవాడు
మంత్రము తానైనట్టి వాడు
స్మరించుకొనవలసిన వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు