271)నైకరూపః -
ఒకరూపం లేనట్టివాడు
బహురూపిగా నుండేవాడు
అనేకవిధాల కనిపించువాడు
ఇట్టిరూపమని చెప్పలేనివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
272)బృహుద్రూపః -
బ్రహ్మాండస్వరూపము గలవాడు
కొలువలేనట్టి స్వారూపుడు
విశ్వాంతరాళములు నిండినవాడు
బృహుద్రూపములో నున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
273)శిపివిష్టః -
సూర్యకిరణ తేజమున్నట్టివాడు
వేడి ప్రతాపము చూపించువాడు
రవి సమానుడైయున్నవాడు
కాంతిశక్తి తానైయున్న వాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
274)ప్రకాశనః -
అన్నిటిని వెలిగించువాడు
సర్వమును ప్రకాశింపజేయువాడు
కాంతిని ప్రసాదించుచున్నవాడు
తేజమున్నటువంటివాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
275)ఓజస్తేజో ద్యుతిధరః -
ఓజస్సును కలిగియున్నవాడు
తేజోవంతము అయినవాడు
ద్యుతిని కలిగించువాడు
కీర్తిని ధరించియున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి