221)న్యాయః -
సత్యజ్ఞానము ప్రసాదించువాడు
తర్కము తానైనట్టివాడు
యుక్తిని కలిగించగలవాడు
న్యాయము చేయగల సమర్థుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
222) -నేతా-
జగత్తుకు అధినేతయైనవాడు
విశ్వ సారధియైనట్టి వాడు
నాయకుడయి నడిపించేవాడు
మంచిచెడులు నేర్పించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
223)సమీరణః -
ప్రాణవాయువు తానైనవాడు
గాలిరూపములో నుండువాడు
శ్వాసకు ఆధారమైనవాడు
ఊపిరిని అందించువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
224)సహస్రమూర్థః -
సహస్ర శిరస్సులు గలవాడు
వేయివిధముల శాసించువాడు
అన్నియు తానేఅయినట్టివాడు
వేయితలలున్న ఆదిశేషుడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
225)విశ్వాత్మా -
విశ్వముకు ఆత్మయైనట్టివాడు
లోకముకు కదలికలిచ్చువాడు
ప్రజలను నడిపించేవాడు
ప్రకృతిని శాశించగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి