నామనసుకు నీపాదాలకడ
రవ్వంత చోటివ్వు సఖీ!
నీ దరహాసచంద్రికల కోసం
నీరవ నిశీధిలో
చకోరంలా ఎదురుచూస్తూ
రసడోలికలూగించే ఆ కన్నుల
దర్శనభాగ్యం కోసం
మతిచెడి సంచరిస్తున్న నన్ను
హత్తుకొని సహృదయంతో ఊరడిస్తావని
తీయనైన మన కలయికను పరిహసించక
నిజంగానే నీవు నన్ను ప్రేమిస్తున్నావని
నాహృదయం చెబుతోంది ప్రియా
దంబమెరుగని నీకూ ఆసంగతి తెలుసుకదూ!!
**************************************
రవ్వంత చోటివ్వు సఖీ!
నీ దరహాసచంద్రికల కోసం
నీరవ నిశీధిలో
చకోరంలా ఎదురుచూస్తూ
రసడోలికలూగించే ఆ కన్నుల
దర్శనభాగ్యం కోసం
మతిచెడి సంచరిస్తున్న నన్ను
హత్తుకొని సహృదయంతో ఊరడిస్తావని
తీయనైన మన కలయికను పరిహసించక
నిజంగానే నీవు నన్ను ప్రేమిస్తున్నావని
నాహృదయం చెబుతోంది ప్రియా
దంబమెరుగని నీకూ ఆసంగతి తెలుసుకదూ!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి