ఆమె!!!?;- ప్రతాప్ కౌటిళ్యా
ఆమె
తలగడ క్రింద-‌ సముద్రమే దాగుంది.!
జీవితాంతం దాన్ని దాచి ఉంచింది.!!!

ఆమె
గుండెల్లో సుడిగుండాలే ఉన్నాయి.!
కంటికి కనిపించకుండా మూచీ ఉంచింది.!!

ఆమె
మాటల్లో మందు గుండు సామాగ్రి ఉంది.!!
ఆమె మంటల నార్పే యంత్రంలా ఉంటుంది

ఆమె
నడకల్లో ఎన్నో నదులు ఉన్నాయి.!
చిక్కని పాదరసంలా పారుతుంది.!!

ఆమె
చేతుల్లో తుపాకులు ఉన్నాయి.!!
చేతల్లో మెత్తని తమలపాకులు ఉన్నాయి.!!

ఆమె
చూపుల్లో గుచ్చుకునే సూదులు ఉన్నాయి.!
ఆమె హృదయంలో చల్లని ఉదయాలున్నావీ.!!!!!!!!!!!!!

ఆమె
స్పర్శలో ఎన్నో ఓర్పు లున్నాయి.!!
కోటి కోటి నిట్టూర్పులు ఉన్నాయి.!!
ఆమె ఒడిలో
అందమైన అజంతా రూపాలు ఉన్నాయి.!!

ఆమె
నవ్వుల్లో సిరిమువ్వలు ఉన్నాయి.!!
గుడి గంటలు ఉన్నాయి.!!
ఆమె నవ్వు అమ్మ ఒడిలా ఉంటుంది.!!!

అమ్మ లాంటి సునీతకు.

ప్రతాప్ కౌటిళ్యా 🙏❤️🙏

కామెంట్‌లు