సౌందర్యలహరి; కొప్పరపు తాయారు
 🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణమ్ ।
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే ॥ 47 ॥
అహః సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా ।
తృతీయా తే దృష్టిర్దరదలితహేమాంబుజరుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీమ్ ॥ 48 ॥
47) అమ్మా!నీవు జగత్తునకు అభయాన్ని ప్రసాదించే దానివి నీ కనుబొమ్మలు ఇంచుకవంగి ఆ మన్మధుని దక్షిణ హస్తములోని ధనస్సుగా ఉన్నాయి. ఆ
ధనస్సునకు నీ నయనాలే నారి త్రాడు. వాటి మధ్యభాగం విడికిలిగాక కింద ముంగేయి దాగు ఉంది కదా తల్లీ!

48) అమ్మా,! నీ దక్షిణ నేత్రం సూర్యా త్మకం కావడం వల్లపగలు, వామనేత్రం  చంద్రాత్మకం కావడం వల్ల రాత్రి, ఏర్పడుచున్నవి.ఈషడ్వికసిత సువర్ణ నిర్మిత కమల సదృశ  శోభాయుక్తమైన నీ తృతీయ నేత్రం అహోరాత్రాలకు మధ్యనుండే సంధ్య అవుతున్నది కదా తల్లీ! ****🌟***
తాయారు 🪷

కామెంట్‌లు