భీష్మని యుద్ధం! అచ్యుతుని రాజ్యశ్రీ

 దైవాంశ సంభూతుడు ధర్మాత్ముడు భీష్మ పితామహుడు.9 రోజులు కౌరవసర్వసైన్యాధ్యక్షునిగా భీకర యుద్ధం చేసి పాండవులను కకావికలం చేశాడు.తనమాట నిలబెట్టుకుంటూ శక్తి సామర్థ్యాలు చూపుతూ హడలెత్తించిన భీష్ముని దగ్గరకు ధర్మరాజు వచ్చి" తాతా! నీ ఎదుట మేం నిలబడలేక పోతున్నాం" అని దీనంగా అన్నాడు.రెండుసార్లు తాతగారి బారినుండి కాపాడిన వాడు కృష్ణ పరమాత్మ.చక్రం అడ్డుపెట్టి ఆదుకున్నాడు." నేను చావాలి.నాకు యుద్ధాలు చేసి చేసి విసుగ్గా ఉంది.ముసలివాడినై ఇంకా ఇంకా యుద్ధం చేస్తూ నేను ఏం సాధించాలి?" అనే విసుగు నిర్లిప్తత భీష్మునిలో కలగాలి.మంచంపట్టిన పండు ముసలివారు " దేవుడా! నన్ను తీసుకుని వెళ్లి పో!" అని ఎలా మానసిక శారీరక బాధ చింత అనుభవిస్తారో  అలాంటి భావం భీష్మునిలో  కలగాలి.పైగా ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది.శిఖండి ఎదురుగా నిలబడి బాణంవేస్తే తాను యుద్ధం చేయను అని ప్రతినబూనాడు.అందుకే శిఖండి వేసిన బాణాలు తగల్లేదు.వెనకనుంచి అర్జునుడు వేసిన బాణాలు నేలకూల్చాయి.అందుకే 9రోజుల యుద్ధం తరువాత ధర్మరాజు ఆయన దగ్గరకు వెళ్ళి " తాతా! ధర్మం నిలబడాలి.నీవు గెలుస్తావు అని ఆశీర్వదించావు.స్వచ్ఛందమరణం ఎప్పుడు కోరుకుంటావు?" అని ధర్మబద్ధంగా అడిగాడు. అందుకే " నాకు విసుగ్గా ఉంది. నాకు చాలు జీవితం.మహావీరుడైన అర్జునుడు బాణంతో నే అవతారం చాలిస్తాను" అని తన మనసులో మాటను బైటపెట్టి 10 వరోజు‌ బాణాలతో నిండిన ఆశరీరంని నేలపై వాల్చాడు.అంపశయ్యపై శారీరక మానసిక బాధలు అనుభవిస్తూ కృష్ణ పరమాత్మ ని తల్చుకుంటూ ఈశరీరం వదిలి వెళ్లాడు. అదీ భీష్మ యుద్ధం 🌷
కామెంట్‌లు