తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద జన జాతర *సమ్మక్క-సారక్క* పండుగ సందర్భంగా
=================================================================
సకల జనుల మాట సమ్మక్క సారక్క
జాతరనుచుతుండ్రి జగమునందు
బాటలన్ని కూడ పరుగు మేడారము
జనుల గుండె దరువు జాతరందు
జంట జంటగాను జంపన్న వాగులో
తానమాడుతుండ్రి తాండవమున
సకల సంబరంబు సమ్మక్క సారక్క
గద్దెలందు నిలిచి కన్నులార
పసిడి బెల్లమందు బంగారు మొక్కులు
తూకమందు నిలిచి సాకపంచు
చీమలోలె వరుస చిత్రంబు జాతర
వనమునందులోన వంటవార్పు
పలుకుతున్న మాట చిలుకల గుట్టపై
బరిణెతోని వచ్చి వారసులుగ
గద్దెనెక్కినంత గణముగా పూజలు
జనము జాతరగను జాగృతంబు
కొలిచిమొక్కినంత కొంగుబంగారము
వనము దేవతలుగ జనము పూజ
మేళ తాళమందు మేడారమందున
గిరిజనులది సొబగు వరములిడగ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి