శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
311)శిఖండీ-

శిఖలో నెమలిపింఛమున్నవాడు 
కృష్ణ అవతారమున్నవాడు 
నెమలిపురిబోలినట్టి వాడు 
నెమలి ఈకను ధరించినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
312)నహుషః -

మాయచే బంధించువాడు
సంసారమగ్నులను చేయువాడు
కర్మలను కలిగించుచున్నవాడు
ఫలితములు ఇచ్చినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
313)వృషః -

ధర్మమును పాటించుచున్నవాడు
ధర్మస్వరూపం తానైనవాడు
కర్మలలో ధర్మమును చేర్చువాడు
అధర్మమును అణిచివేయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
314)క్రోధహా -

సాధకుల క్రోధమునణచువాడు
సరియైనమార్గం చూపువాడు
క్రోధభావనలు తీసివేయువాడు
శాంతిని ప్రసాదించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
315)క్రోధ కృత్కర్తా -


క్రోధమున్నవారిని హరించువాడు
కోపతాపములు తొలగించువాడు
కాఠిన్యభావము నిర్జించువాడు
సాత్వికధోరణి నిలుపువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు