గలే రేఖాస్తిస్రో గతిగమకగీతైకనిపుణే
వివాహవ్యానద్ధప్రగుణగుణసంఖ్యాప్రతిభువః ।
విరాజంతే నానావిధమధురరాగాకరభువాం
త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవ తే ॥ 69 ॥
మృణాలీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః ।
నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో-
శ్చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా ॥ 70
69) అమ్మా ;సంగీతమధ్యంలో గతి గమక మరియు గీతాలలో నిష్ణాతులు. ఉన్న మూడు అదృష్ట రేఖలు బహుశా గుర్తు చేసుకుంటే మీ వివాహ సమయంలో కట్టబడిన అనేక రకాల దారాలు సంఖ్యను మరియు స్థలాన్ని గుర్తుచేస్తుంది ఆ గీతలు సత్యము మద్యమం మరియు గాంధార స్వరాలను గుర్తు చేస్తున్నాయి
కదా తల్లీ!
70) ఓ పరమేశ్వరీ! బ్రహ్మగారు తన ప్రధమ శిరస్సు ను ఖండించిన పరమ శివుని నఖాలుకు భీతి చెంది మిగిలిన చతుర్ముఖాలకు అభయాన్ని ప్రసాదిస్తావన్న తలంపుతో నాలుగుమోములతో తామర తూడులవంటి మృదువైన నీ నాలుగు భుజాల సౌందర్యాన్ని స్తుతిస్తున్నాడు కదా తల్లీ !
****🌟***
🌟 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి