చీకటిలో ఒంటరిగా
ఇరుగట్లకు చేరువగా
మౌనంగా ప్రవహించే
ఏటిలోని సడికి అర్థం
వెదకాలి...
కాలంతో పాటుగా
పల్లంతో పోటీగా
పరుగులు పెట్టే
ప్రవాహపు జోరెందుకో
కనుక్కోవాలి.
దూరాన తూరుపు దిక్కున
శిఖరాల మధ్యన విరిసే
వెలుగుపువ్వు కురిపించే
మెరుపు రవ్వల జిలుగులేంటో
తెలుసుకోవాలి.
నీరు దాచిన కరిమబ్బులు
ఊరి ముంగిట మోహరించి
కురిపించే చిరుజల్లుల
చల్లదనపు హాయి విలువ
గమనించాలి.
దివిని వదిలి భువికి తరలి
వస్తున్న వెలుగు ఱేడు
కళలన్నీ కనులముందు
కనిపిస్తే కాజేసి దాచుకోడానికి
ప్రయత్నించాలి.
గగనపువేదిక పై
సంధ్యాసుందరి చేసే
నాట్య విన్యాసపు ఝరి
కనులకు విందుగ అనిపించే
కమ్మని ఉదయానికి
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి