,రాష్ట్రస్థాయిలో నూతన కార్యవర్గాల ఏర్పాటు
(అవార్డు టీచర్స్ అసోసియేషన్) ఆర్గనైజేషన్ తెలంగాణ 33 జిల్లాల్లో 2024 సంవత్సరానికి గాను జిల్లాల కార్యవర్గాలను ఏర్పాటు,, ,రాష్ట్రస్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని, ఆట ద్వారా ఈ సంవత్సరపు క్యాలెండర్ను   కామారెడ్డి జిల్లా తయారుచేసిన 2024 క్యాలెండర్ను, తేదీ 4, ఫిబ్రవరి 2024 నాడు తెలంగాణ సచివాలయం నందు మంత్రివర్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  డి శ్రీధర్ బాబు చేతుల మీదు గా ఆవిష్కరణ చేయించడం జరిగినది. ఆట ఫౌండర్ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాస్ గారు, ఆట గౌరవ అధ్యక్షులు ఎన్ జనార్ధన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బాల్ రెడ్డి గారు శాలువాలతో భద్రాచలం శ్రీరాముని ప్రసాదం అందిస్తూ శాలువాలతో మంత్రివర్యులను సన్మానం చేసినారు. వారు మాట్లాడుతూ* ఆట* ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఆట బాలోత్సవం, భద్రాద్రి నృత్యాభిషేకం, భద్రాద్రి స్వరాభిషేకం, ఆట మహిళా దినోత్సవం, భద్రాద్రి కోలాటం, ఆట హరితహారం, ఆట హెల్త్ క్యాంపు, ఆట అవార్డ్స్ గురించి వారికి తెలియజేయడం జరిగింది. అందులో పాల్గొన్న అవార్డు టీచర్స్, వారితో మాట్లాడుతూ మీ ద్వారా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం, ప్రజల సంక్షేమం గురించి నిరంతరము ప్రజా పరిపాలన చేయాలని దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరగాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర సభ్యులు బాల్ రెడ్డి గారు, నాయుడు వెంకటేశ్వర్లు గారు, తదితరులు పాల్గొన్నారు.
 


కామెంట్‌లు