సుప్రభాత కవిత ; - బృంద
కలిమితో కుబేరుడు అవడం
కష్టం
మంచితనంతో మాధవుడు
కావడం సులభం

కాలానికి అనుగుణంగా
మారడం సహజం
గాలాలను  కనుక్కోవడం
వివేకం

అనుకున్నది సాధించడం
అదృష్టం
అందినది మనవనుకుని
ఆనందించడం సంతోషం

అవసరానికి మించి
కావాలనుకోడం
అత్యాశ
ఉన్నదాని విలువ గుర్తించడం
తృప్తి

ఒక్కడే ఎదగాలనుకోడం
అసూయ
అందరినీ కలుపుకోడం
మంచితనం

అందరూ బాగుండాలనుకోవడం
గొప్పదనం
అందరిలో గుర్తించబడడం
ఘనత

నీటివాలు ప్రయాణాల
ఏటి పడవల బ్రతుకులో
కోటి కలలను సాకారం చేసి
మేటిగా నిలబెట్టే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు