ఎగిసిపడే అలల కెరటమంటే
నాకెంతో ఇష్టం,
ఎంతకిందపడినా , అలిసిపోకుండా
రెట్టింపు ఉత్సాహంతో పడిలేచే
కెరటాలు, మానవ జీవితానికి ఆనవాళ్లు,
కెరటాలతో ఆడుతూ సముద్రపు
అలలతోఆనందంగా
ఆడడమే మనకు తెలుసు,
కానీ ఆసముద్రంలో
ఎన్ని సుడిగుండాలు ఉన్నాయో
,ఆ అలల కెరటాలకే తెలుసు,
ఆ సుడిగుండాల అటుపోట్లకు తట్టుకున్న
కెరటాలను మనం గమనించామా?
సమస్యలతో తట్టుకునే మనిషి జీవితమూ అంతే!
బాధ్యత కల వ్యక్తికి నిత్యము
సుడిగుండాల పయనమే,!
ఎన్నిసార్లు కిందపడినా ఆశతో
పైకి లేవడమే జీవితమార్గం,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి