ఒక్కక్షణం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఒక్కక్షణంలో
ఒక ఆలోచన పుడుతుంది
దాంతో
వారి జీవన స్వరూపం
మారిపోతుంది
మరుక్షణం
పునాదులు కూలిపోయి కబళిస్తాయి
లేదా 
అందనంత ఎత్తులో నిలబెడుతుంది
ఒక్కక్షణంలో
తీసుకున్న నిర్ణయం
అందలానికో , పతనానికో
కారణమవుతుంది
ఆశ , దురాశ ఒక్కక్షణం
నిరాశ , ఆత్మవిశ్వాసం ఒక్కక్షణం
అదృష్టం , దురదృష్టం ఒక్కక్షణం
ఉత్సాహం , నిర్వేదం ఒక్కక్షణం
మానవజగతిని శాసించేది
ఒక్కక్షణమే కదూ !!
**************************************
:-

కామెంట్‌లు