:ప్రేమ; - సాహితీసింధు,పద్యగుణవతి సరళగున్నాల

 నవ్వులు నింపు మానసము ,నాటక మౌ జనజీవమందునన్
రువ్వెడి ప్రేమపూవులు సరోజములట్టునహాయినింపుచున్
చివ్వున లేచు కోపమును చేరివచించెడు వాక్సుధారసం
బెవ్వరి సొత్తుగాదు మనసెర్గినవారల యాత్మయే సుమా
కామెంట్‌లు