సుప్రభాత కవిత ; - బృంద
చీకటింట సిరిదీపమై
చిరునవ్వుల వెలుగులు
చిరకాలం నిలపాలని
తొలి సంధ్యాసమయానికి
వినతులు

తూరుపింట ప్రభవించి
వెలుగురేఖలు ప్రసరించి
జీవ చైతన్యం ప్రసాదించమని
బాల భాస్కరునికి
విన్నపాలు

నింగిలోని నీరదాలకు
నీమముగా పయనించి
నెల మూడు వానలు కురిసి
నేలతల్లికి పంటసిరిని కానుకిమ్మని
ప్రార్థనలు


పంటపొలాలను పలకరించి
పాడిపంటలు పుష్కలంగా
బహుకరించి బ్రతుకులన్నీ
పండించమని కడలి చేరే నదులకు
వేడుకోళ్ళు

అలలు ఎన్ని కుదిపేసినా
సుడులు ఎన్ని ఎదురొచ్చినా
బడబానలం దాచినా 
భవసాగరమీదే బలమిమ్మని
మొరలు

రోజుకో కొత్త అనుభవమిచ్చి
రివాజుగా వెలుగులు పంచి
మోజుగా ఆశలు పెంచి
రాజులా బ్రతకమనే దినరాజుకు
వందనాలు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు