వ్యర్థం తో అర్థం! అచ్యుతుని రాజ్యశ్రీ

 వ్యర్థం అంటే పనికిరానిది.అర్ధం అంటే మాటల అర్థం డబ్బు అని కూడా అంటారు.మనం రోజూ ఎంతో చెత్త చెదారం ఇంటాబయటా కూరగాయల మార్కెట్లో చూస్తూ ఉంటాం.కానీ జీవితం లో స్థిరపడిన ఆయువకులు ఆదర్శం గా ఎలా నిలిచారు అన్నది చదువుదాం.అమెరికా లో జాబ్ మానేసి పర్యావరణానికి హాని కల్గించే మనం పారేసే ఆకులు చెట్లతో అనిల్ కుమార్ యాదవ్ అరటి ఆకులు పోకచెక్క వక్కలచెట్లను వడ్లపొట్టుతో ప్లేట్లు తయారు చేస్తారు.కర్ణాటకలో శిక్షణ పొందిన ఈయన ఆడవారికి ఉపాధి కల్పిస్తున్నాడు.ఆకుల్ని నీటిలో నానబెట్టి వీటితో చేయడం విశేషం.అలాగే మధ్యప్రదేశ్ కి చెందిన మేహుల్ నెలకో 25లక్షలు సంపాదన! దేనితో అంటారా? అరటి తొక్కల్తో అరటి ఆకులు కొట్టేసిన చెట్లు కొని బుట్టలు సంచులు చాపలు గోడ గడియారం తయారు చేస్తున్నారు.పంటకోత అరటిచెట్లను కాల్చి బూడిద చేయకుండా అద్భుతమైన వస్తువులు చేయటం గొప్ప కదూ? అలాగే తనయ్ జైన్ వస్త్రాల తుక్కు తో  పిల్లలకి అందమైన స్కూల్ డ్రెస్ కుర్తా ఫ్రాక్ తయారు చేస్తున్నారు.కరోనాకాలంలో లక్షల కొద్దీ మాస్కులు ఉచితంగా పంచాడు.ఇటు కుటుంబ వ్యాపారం తోపాటు వ్యర్థం గా పారేసే బట్టి ముక్కలతో అర్థం కలిపిస్తున్నాడు.మనం కూడా బట్టముక్కలు సేకరించి రకరకాల డిజైన్లు కత్తిరించి కాగితం అట్టపై అతికించి గ్రీటింగ్ కార్డులు తయారు చేయవచ్చు.🌷
కామెంట్‌లు