హరీ!'శతకపద్యములు;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 55.
ఉత్పలమాల.
చక్కగ వేణువూదుచును సంపదలన్నియు కాచువాడ!నీ
ప్రక్కన తోడుగా జనుచు ప్రాజ్ఞత కల్గిన యుద్ధవుండుతాన్
సొక్కుచు నాలకించెనట సొంపుగ తెల్పగ నీవు సాంఖ్యమున్ 
నిక్కము!నీదు నెయ్యమును నెమ్మదిఁ గోరితి నీయుమా హరీ!//
56.
చంపకమాల.
మరణము తప్పదంచు మహిమాన్వితు డాకురువంశజుండు నిన్
శరణము వేడి నీ కథలు శ్రావ్యముగా విని ముక్తినొందె శ్రీ
కరమగు నీదు పాదములు కర్మల భారముఁ దొల్గచేయు నే
శిరమును వంచి మ్రొక్కెదను జిత్తము నందున నిల్వుమా హరీ!//

కామెంట్‌లు