జ్ఞానదీప్తి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 వంగర కుగ్రామంలో పుట్టి
ఢిల్లీ మహానగరంలో అడుగుపెట్టి
చాణక్య నీతి ప్రతిరూపం 
భరతజాతి అపురూపం
బహుభాషా పాండితి
రాజనీతి చాతురి
రాజకీయ నిత్యరవి
విపక్ష హృదయపవి
తెలుగు రాజనీతివెలుగు 
స్మరిస్తేనే పుణ్యం కలుగు
తెలంగాణ ముద్దుబిడ్డ పీవి 
భారతీయ కీర్తిశిఖర ఠీవి
ఆర్థికసంస్కరణలకు ఆద్యుడు 
ప్రభుత్వాన్ని నిలబెట్టిన నిరవద్యుడు
ప్రధానిపీఠం అధిరోహించిన నిండుకుండ 
మౌనసాక్షిగా ఉన్నాడు తొణకకుండ
నిఖార్సు అయిన వ్యక్తిత్వం 
జాతి వికాస కర్తుత్వం
తెలంగాణ తేజోమూర్తి 
తరతరాల నిత్యస్ఫూర్తి
తెలంగాణ బిడ్డ సత్త్వాన్ని 
భారతీయ జనత తత్త్వాన్ని
తెలంగాణ వ్యక్తి కలాన్ని 
భారతీయ భవిత బలాన్ని
తెలంగాణ వాడిలోని జానపదాన్ని 
తెలంగాణ వాడిలోని జ్ఞానపదాన్ని
తెలంగాణ జాతికున్న గౌరవాన్ని 
తెలంగాణ వాడికున్న ఆత్మగౌరవాన్ని
అంతర్జాతీయస్థాయికి ఏగబాకి 
ఖండాంతర సీమలలో ఖ్యాతిసాకి
తెలుగు సంప్రదాయానికి సాక్షి 
తెలుగు సంస్కృతికి అక్షి
నీవు సేదదీరిన జ్ఞానభూమి 
మాకు నిరంతర స్ఫూర్తిభూమి
తెలుగుజాతి వెలుగుదీప్తి 
భరతజాతి జ్ఞానదీప్తి
భారతరత్నం భారతరత్నం!!!
**************************************

కామెంట్‌లు