కంచి పరమాచార్య గూర్చి కొన్ని విశేషాలు; - సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ

 నడిచే దైవం కంచి పరమాచార్య అతి సామాన్య జనానికి చేసిన సాయం ప్రేరణ నిజంగా అపూర్వం.
యాగం చేసేటప్పుడు హోమంలో నెయ్యిని ఒక కొయ్య గరిటెతో పోస్తారు.దాన్ని సృక్ అంటారు.ఒక పురోహితుడికి ఆయన స్వయంగా బహూకరించారు.ఆవ్యక్తి దాన్ని ప్రాణప్రదంగా దాచుకుని వచ్చిన ప్రతివారికీ చూపుతూ" ఇది కంచి పరమాచార్య స్వయంగా నాకు ఇచ్చిన అపురూప కానుక.దీనిముందు సంభావనలు సన్మానాలు తక్కువ" అని పొంగిపోయాడు.2పరమాచార్య ఎప్పుడూ గోశాల లో పడుకునే వారు.కటికనేలపై వాటిని చూస్తూ " ఇంతకన్నా అమృత సుఖాన్ని ఇచ్చే ప్రాంతం నాకు తెలీదు." అనేవారు.ఫైవ్ స్టార్ హోటల్ లో దొరకని ఆధ్యాత్మిక ఆనందం అనుభూతి ఆయనకు గోశాల లోనే లభించింది.సైన్స్ పరంగా చూసినా ఆవుపేడ మూత్రం వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది.ప్రతి దేవాలయం లో గోశాల ఉండితీరాలి సుమా!
కామెంట్‌లు