జాతీయస్థాయి కథల పోటీలలో తడపాకల విద్యార్థులకు బహుమతులు.

  జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని లీలావతి దవే బాలల సైన్స్ ఫిక్షన్ కథల పోటీలలో తడపాకల విద్యార్థులు ప్రత్యేక బహుమతులు గెలుచుకున్నారు. గత నెలలో నిర్వహించిన ఈ పోటీలలో తడపాకల పాఠశాల నుండి ఆరు కథలు పంపగా అందులో రీమ్ షా (8, వ) రాసిన " అమ్మ కోరిక" అనే కథ మరియు రక్షిత (9వ) రాసిన కథ "ఇనుప ఇల్లు" అనే కథలకు బహుమతులు లభించాయని తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. వీరికి త్వరలోనే నగదు బహుమతిని ప్రశంసా పత్రాలను అందజేస్తారని తెలిపారు. ఇదే కార్యక్రమంలో జిల్లాస్థాయి సైన్స్ పోటీలలో కవిత్వపు విభాగంలో జిల్లా రెండవ బహుమతిని పొందిన రీమ్ షా ను అదేవిధంగా పాటలు విభాగంలో ప్రత్యేక బహుమతిని పొందిన సాయి సిద్ధార్థ కు మెమెంటో మరియు ప్రశంసా పత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జావిద్ అందజేశారు. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన రీమ్ షా ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  సుధాకర్, గంగాధర్, కృష్ణ ప్రసాద్, నరేందర్, నాగప్ప,రవి,రాములు,స్వప్న,సుజాత,విజయ పాల్గొన్నారు.
కామెంట్‌లు