అంతరిక్షంలో పరిశోధనశాల;- సి.హెచ్.ప్రతాప్

 అంతరిక్షంలో పరిశోధనశాలను నిర్మించతలపెట్టడం శాస్త్ర సాంకేతికరంగంలో భారత్ సాధిస్తున్న అభివృద్ధికి మరో సంకేతం. . ఇప్ప టివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే సొంత అంతరిక్ష కేంద్రాలను నిర్మించుకున్నాయి . ఇతరదేశాల సహాయ సహకారాలు లేకుండా సొంతంగా ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించతలపెట్టడం కూడా ఇస్రో సంస్థ సాధిస్తున్న రోదసీ పరిజ్ఞానం లో సాధిస్తున్న స్వయం సమృద్ధికి మరొక నిదర్శనం.  ఔషధరంగంతో పాటు, ఖగోళ జీవశాస్త్రం, అనేక ఖగోళం, అంతరిక్షం, భౌతిక ధర్మాల పరిశీలన, వాతావరణం వంటి పలురంగాల్లో పరిశోధనలకు ఈ అంతర్జాతీయ పరిశోధనాశాల ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 2030 నాటికి ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న భారత్ స్వప్నం నెరవేరితే ఇటువంటి అరుదైన ఘనత సాధించిన ప్రపంచం లో నాలుగవ దేశం గా  వినుతికెక్కుతుంది.  అంతరిక్షాన్ని యుద్ధానికి వేదికగా కాకుండా శాంతియుత అవసరాల కోసమే వాడుకోవాలనేది భారత్ సాంప్రదాయ విధానం. కానీ అంతర్జాతీయరంగంలో వచ్చిన మార్పుల వల్ల భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయక తప్పడం లేదన్న కేంద్ర ప్రభుత్వం వాదన సమర్ధనీయం గా వుంది. 2014 లో అధికారం చేపట్టిన నాటి నుండి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లో అద్భుత విజయాలు సాధించించేందుకు  చక్కని సహాయ సహకారాలను అందిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ఖ్యాతిలో కొంత భాగం దక్కుతుంది.
కామెంట్‌లు