బాటసారులం- రాధా రాణి. వేమూరి-హైదరాబాద్
కుసుమ ధర్మన్న కళాపీఠం
====================
జీవితం క్షణ బంగురం
తెలిసీ ఒప్పుకోని అంతరంగం
గమ్యం తెలియని బాటసారులం

కలల అలలను మోసుకుంటూ కష్టాలను కౌగిలించుకుంటూ పడి లేచే కెరటాలం

తీరాన్ని చేరలేక, బ్రతుకు బండిని లాగలేక
డస్సి పోయిన హృదయాలెన్నో కడలిలో కలిసే ప్రాణాలెన్నో

అచ్చి రాని బంధాలెన్నో
కదా వరకు కలిసి వుండే బంధుత్వాలెన్నో

సుఖాలలో తేలే సుందర క్షణాలెన్నో
చెరిగి పోని చేదు అనుభవాలెన్నో
జీవిత నేర్పే పాఠాలెన్నో
కాలపు పడవలో ఆటు పోట్లెన్నో

జీవన మరణ పద కేళిలో గెలుపు రాతలెన్నో
చివరి మజిలీ కై ఎదురు చూసే ప్రాణాలెన్నో.

ఆట ఆడేదేవరో ఆడించేదెవరో అంతా బ్రాంతే.
బ్రతుకంతా మిధ్యే.


కామెంట్‌లు