సౌందర్య లహరి ;- కొప్పరపు తాయారు
 🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟

రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్-
నివృత్తైశ్చండాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః ।
విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలా
విలీయంతే మాతస్తవ వదనతాంబూలకబలాః ॥ 65 ॥

విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతే
త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే ।
తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతమ్ ॥ 66
65) అమ్మా! సమరమున రాక్షసులను జయించి వచ్చి తలపాగాలను తొలగించి కవచములను తొలగించని వారును , చంద్రుడు అను ప్రమధునిచే
అనుభవింపదగిన హర నిర్మాల్యమునందు విముఖులైన, వారును, అగు కుమారస్వామీ ఇంద్రుడు విష్ణువు  మొదలగు వారిచే చంద్రుని
వలె స్వఛ్ఛమైన, నిర్మలములైన నీ ముఖము నందలి తాంబూలపు ముద్దలు గ్రహింప బడుచున్నవి కదా!

66) జననీ! పశుపతి మరిచిపోయిన లోకోప కార్యాలను వీణపై గానం చేసే సమయంలో నువ్వు శిరస్సు ఊపుతూ సరస్వతిని శ్లాఘిస్తూ పలకడం ప్రారంభించగా నీ వాజ్ఞ్మాధూర్యం వల్ల వీణ కలరవా
నినాదాలు పేలవంకాగా, వాణి తన వీణను వస్త్రాఛ్ఛాదితం చేసేసింది. అమ్మా! నీ. వాణీ
మాధుర్యం ముందు సరస్వతి వీణా నాదం సరిపోడం లేదుగా తల్లీ !
              ,***🌟***
🪷 తాయారు 🌟

కామెంట్‌లు