ఐక్యత లేని సమాజంలోకంటిలో నలకల్లాస్వార్థం నిండిన కొంతమందితోపక్కలో బల్లెం లాదేశ ద్రోహులుదేశం నిండా ముళ్ళపొదల్లాగోతి దగ్గర నక్కల్లా ఎదురు చూస్తు !!అంతర్గతంగానేఆంతరంగికులే అసూయతోఅంతఃపుర కుట్రలతోఅంటకాగుతూనేఅధఃపాతాళం తొక్కేసిఅంతం చేస్తున్నఆత్మ బంధువుల పడగ నీడలో, పాలకులైన రాజులు!!వెరసిపద్ధతి లేని ఒక నిబద్ధత నిబంధనలు లేనిఅనేక ఆచార వ్యవహారాల మధ్యఅనైక్యతతో పరాధీనమైన సనాతన భారత మాత!!చిన్న చిన్న సంస్థానాలుపెద్ద పెద్ద సామ్రాజ్యాలుఒకరికొకరికి పొసగని వైనంసహకరించుకొనుటే తెలియని కుసంస్కారం!!అందుకేఒక తురుష్కుడైన కిరాతక తైమూర్ ఖాన్వంశజుడు,బాబర్ దాడి చేసి నేలమట్టము చేసిన మందిరంపై బాబ్రీ మసీదు నిర్మించిఫైసలా బాద్ గా అయోధ్య పేరు మార్చగలిగాడు !!దులుదుండ వనంలోతులసి మొక్కలు చిగురు వేసినట్లుదేశభక్తులు, సాధువులు సన్యాసులుఆత్మ గౌరవం కలిగిన సామాన్యులురాముని సైన్యమై అజేయంగా ముందుకు మున్ముందుకుఅనిలో కొనసాగుతూనే వున్నారు!!నాటి నుంచి నేటి వరకుఅలుపెరుగక అసిగాయాలైనా,అనంతవాయువల్లో ప్రాణాలు కలిసి పోయిన సంఘటనలకు,అనేక లక్షల మంది రుధిర తర్పణాలకు ,సరయూనదిసాక్షీ భూతమై నిలిచింది!!అదే తీరు పారతంత్ర్యంలోనుఅదే పీడ స్వాతంత్ర్య భారత దేశంలో కూడావిస్మయం వ్యక్తమవుతోంది కదూ,వ్యక్తం కాకపోతేనే...ఆలోచించాలి!రామ భక్తులనుఅనేక వేల మంది కరసేవకులను తుపాకీ గుళ్ళజడివానతో గుండెలు పేల్చి గొంతుల్లో కాల్చిసరయూనదిలో విసిరి పారేసిన పాషండులుమన స్వతంత్ర భారతావని పాలకులే సుమా !!అయినా! ఆగలేదు ఆ పోరు !ఆ విష వృక్షం పెకిలించే వరకు!వేర్లతో సహా !అంతిమ పోరులో!అమరపురికేగిన కరసేవకుల ఆత్మ సాక్షిగాఅత్యున్నత న్యాయస్థానంఆదేశముతోఅయోధ్యలో అంగరంగ వైభవంగాఆ బాలరాముని పునః ప్రతిష్ఠ!!నింగి నేలఒక్కటైచేసుకుంటున్నసంబరాల మధ్య జరుగుతోంది!!అందరి మదిని ఆనందనిలయం చేస్తుందిఅందరినీ ఐక్యత పరుస్తూఆదర్శమై మార్గ నిర్దేశం చేస్తుందిఅనంత కాలాలకు స్ఫూర్తినిస్తూ !!
: మతోన్మాదులపై విజయం.;- కేశరాజు వేంకట ప్రభాకర్ రావు-పాతర్లపాడు ఖమ్మం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి