శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )- ఎం. వి. ఉమాదేవి
196)పద్మనాభః -

నాభియందు పద్మమున్నట్టివాడు 
సర్వజీవులకు హృదినున్నవాడు 
హృదయపద్మమునున్నవాడు
పద్మనాభుడై భాసిల్లువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
197) ప్రజాపతిః -

అనంతవిశ్వ ప్రభువైనవాడు
జీవకోటికి రాజైనట్టివాడు
పాలనము జేయుచుండువాడు
విశ్వమును నడిపించుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
198)అమృత్యుః -

మృత్యువులేనట్టి దివ్యతున్నవాడు
మరణము దాపులకు రానివాడు
మరణకారణమెరుగని వాడు
అమృతతత్వం కలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
199)-సర్వదృక్ -

సహజజ్ఞానముగలిగిన వాడు
ప్రాణులు చేసింది చూచువాడు
సర్వులచర్యలు గమనించువాడు
సర్వలోక గ్రాహ్యమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
200)సింహః - 

సింహరూపములో నున్నవాడు
పాపములను నశింపజేయువాడు
ప్రహ్లాదరక్షణ చేసినవాడు
నరసింహావతారమునున్న వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు