ప్రియుని దూరాన చూసిన
ప్రేయసి మొగమంతా
పరచుకున్న సంతోషపు
సందడి తాలూకు నవ్వు
నింగిని ఆదిత్యుని రాకతో
మదిలోని దేవుని ఎదురుగా చూచి
ఎద నింపుకున్న వెలుగుల
జిలుగుల మెరిసే ఏటి నీరు
సంతోషం తమదైతే
సరస్సున సందడెందుకని
ఈసుచెంది తొంగిచూస్తున్న
మబ్బుల మారుతున్న రంగుల రూపు
మేఘాల సందేశం
కిరణాల రాయబారం
నులివెచ్చని సంకేతం
తెలివెలుగుల సోయగం
కన్నుల విందైన కమనీయ
దృశ్య దర్శనంతో
కలలు నిజమైనటుల
కమ్మని భావన కలిగె
ఆకసానికి ఎగసి
ఆవలితీరపు గమ్యం
అందుకొమ్మనే వేకువ పిలుపుకు
స్వాగతమంటూ
🌸🌹సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి