అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో
-------------------------------------------------------------------------
జున్నుపాలకు మిన్న జుంటి తేనెల కన్న
ఖండ శర్కర కన్న కమ్మదనము
పనస తొనలకన్న పంచదారలకన్న
పలుకులందు తెలుగు పసిడి పలుకు
పాల తెలుపు కన్న పంచామృతము కన్న
తేటనైనది మాట తెలుగు భాష
సంగీత సాహిత్య సమలంకృతి తెలుగు
దేశ దేశాలకు తెలుగు వెలుగు
మాతృభాష తెలుగు మరువరాదెప్పుడు
దేశమేదైనను దెలియపలుకు
ఆట వెలది
ఆవుపాలకన్న అమృతము కన్నను
మాతృ భాష పలుకు మమతపెంచు
తెలుగు మధురమనియు తెలియపరచవోయి!
దేశదేశములకు తెలుగు ఘనత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి