విరాటరాజు కొలువులో ధర్మరాజు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ధర్మరాజు మాటలు తక్కువగా మాట్లాడి ఎంతో నేర్పుతో అవతలివారి నోరు మూయిస్తాడు.కంకుభట్టు వేషంలో రాజుతో అంటాడు"నేను ధర్మరాజు శిష్యుడిని.ద్విజుడిని.ఈప్రపంచంలో అంతా నటులే కదా?నా సంపదను బంధువులు లాగేసుకున్నారు.పాచికలు జూదం ఆడటం నాకు ఇష్టం.మీతో పందెం లేకుండా ఆడుతాను.నీచపు కొలువు చేయలేను." ఇక కీచకుడు ద్రౌపదిని సభలోకి లాక్కు వచ్చినపుడు ధర్మరాజు చాలా బాధపడుతాడు. రాజు తన బావమరిదిని ఏమీ అనలేని అసమర్థుడు.కీచకునితో వైరం రాజు పెట్టుకోలేడు.అందుకే అన్యాపదేశంగా ద్రౌపది తో అంటాడు"నీ భర్తలు గంధర్వులు అని చెప్పావు.చాతకపక్షి నీరు ఇచ్చే మబ్బు కోసం వేచి ఉంటుంది.నీవు ఇంకా కదలకుండా సభలో నించోడం మర్యాద కాదు.నల్లమబ్బు మాత్రమే వర్షం కురిపిస్తుంది.సమయం కోసం వేచి ఉన్నారు వారు అని భావించు". మాటలకు ద్రౌపది బాధపడుతూ అంది" నా భర్తలు కూడా నటులు.నాభర్త జూదగాడు కూడా " అనేసి వెళ్లి పోయింది.పాండవుల అదృష్టం ఏమంటే వారిని ఎవరూ అనుమానించరు. బుద్ధి ఆవైపు ఆలోచన చేయదు. కారణం ధర్మరాజు ధర్మబుద్ధి ఆలోచన చేయగల సమర్ధుడు దైవ బలం ఉన్నవాడు.
భీముడు వలలుడు అనేపేరు తో వంటవాడిగా ఉన్నాడు.కీచకుడు తరమటం చూసి కోపంతో వాడిని చావబాదాలని అక్కడున్న చెట్టు ని పీకుతున్నాడు.హనుమంతుడు భీముడు కోపంవస్తే ముందు చెట్లని కూకటివేళ్లతో పెకలించి శత్రువు పై దాడి చేస్తారు.కంకుభట్టు ఆపదరాబోతోంది తమ వేషాలు బైట పడ్తాయని గ్రహించి భీముని ఇలా హెచ్చరించాడు" నీవు వంట చేయటానికి ఎండిన కట్టెపుల్లల్ని వెతుక్కుంటూ వెళ్లు.కాయలు
 పళ్ళతో ఉన్న పచ్చని చెట్లని నరికేయడం పెకలించటం భావ్యం కాదు." అంతే! భీముడు అందులోని మర్మం గ్రహించాడు.తనుఇప్పుడు ఆవేశపడితే కీచకుడిని సభలో చంపితే ఆవార్త గుప్పున వ్యాపించి తమ ఉనికి తెల్సిపోతుంది. కీచకుడు నోరు విప్పకుండా రహస్యంగా వాడి పీచం అణచాలి" ఆన్న కంకుభట్టు మాటల కి ఆవేశం కోపంపోయి వలలుడు సభనుంచి బైటికి వెళ్లి పోయాడు.ఇదీ ధర్మరాజు సమయస్ఫూర్తి మాటచాతుర్యం🌹
కామెంట్‌లు