ప్రపంచంలోని అతిపురాతన సంస్కృతి
అపారసంపదతో అలరారే దివ్యభూమి మనది
తురుష్కులు, తెల్లవారు,డచ్, పోర్చుగీసులు
ఇలా ఎందరో ముష్కరులు ఈ భరతావనిని
శాశ్వితాక్రమణకు పూనుకుంటే
భరతయోధులంతా తమదేహాలు గాయాలపాలైనా
స్వాతంత్ర్యగేయాలు పల్లవిస్తూనే ఉన్నారు
తమశరీరం శవమైనాసరే మనమాతృభూమి
దాస్యశృంఖలాలు తొలగించడమే కర్తవ్యంగా భావించారు
తమ మాతృదేశ స్వాతంత్ర్యము కోసం
ఆత్మార్పణతో, సాయుధపోరాటంతో
సహాయనిరాకరణతో, అహింసా పోరాటంతో
ఇలా తోచినబాటలో యోధులు శివమెత్తి గర్జించారు
వీరశివాజీ,రాణీరుద్రమ,రాణీఝాన్సిలక్ష్మీబాయి
అజాద్, బోస్, నెహ్రూ, బాపూజీ వంటి ఎంతోమంది
భారత స్వాతంత్ర్య సమరంలో దూకిన యోధులు
మన దేశ స్వాతంత్ర్య సమరయోధులకు జోహార్!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి