ధర్మాచరణ-సి.హెచ్.ప్రతాప్
ధర్మో రక్షతి రక్షిత: అనేది
అజరామరమైన వేదవాక్కు
సర్వాకాల సర్వావస్థలయందు
ధర్మాచరణ భారతీయుల కర్తవ్యం
ధైర్యం,ఓర్పు, మనోనిగ్రహం
ఇంద్రియ నిగ్రహం, శాంతం
సమాజ సేవ, సత్య భాషణం
అందరం అలవర్చుకోవాలి
మానవాళికి అవే ఆభరణాలు
ధర్మ హీనమైన జీవితం
చంద్రుడు లేని రాత్రి లా అంధకారమయం
జీవితంలో ఎంత స్థాయికి ఎదిగినా
ఎన్ని భోగ భాగ్యాలు ఆర్జించినా  
ధర్మాన్ని పాటించని జీవితం నిరర్ధకం
ధర్మమే దైవం

ధర్మాచరణతోనే మనుగడ
ధర్మాచరణకు నిబద్ధులై వుండాలి
ప్రతీ ఊపిరిలో ధర్మం పట్ల
ఆశయబద్దులమై వుండాలి
కామ క్రోధాధి దుర్గుణాలను జయించి
వీలైనంతగా దాన ధర్మాలు చేస్తూ
శాస్త్రాలు విధించిన కర్మలను
విధిగా ఆచరించేవారి
జీవితాలే సార్ధకం


కామెంట్‌లు