సౌందర్యలహరి; కొప్పరపు తాయారు
  🌻 శ్రీ శంకరాచార్య విరచిత🌻
 
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటమ్ ।
ఉభాభ్యామేతాభ్యాముదయవిధిముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగదిదమ్ ॥ 41 ॥

ద్వితీయ భాగః - సౌందర్య లహరీ

గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః ।
స నీడేయచ్ఛాయాచ్ఛురణశబలం చంద్రశకలం
ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ॥ 42 ॥
41) అమ్మా,! నీ మూలాధార చక్రంలో లాస్య, పర,
   అంటే నృత్యం చేసే సమయా దేవితో కూడి నవరస పూర్ణమైన నటేశ్వర తాండవ వృక్షం చేసే ఆనటేశ్వర నవత్ముడైన ఆ పరమశివదేవుడుని కూడా నేను స్తుతిస్తున్నాను . ఈ జగత్తుకు జననినీ జనకులైన మీ ఇరువురి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రుడు కావడం వలన అది సనాధంగా భావించ బడుతున్నది కదా తల్లీ !
42)ఓ  హిమగిరి సుతా! నీ సువర్ణ కిరీటాన్ని వర్ణించు వారు ఇంద్రధనస్సు బహిర్గతమైనదా అని ఎందుకు భావించటం లేదు కారణం ఆ కిరీటంలో ఉన్న గగణ మణులు అంటే తార గణ రూపముల మణులతో పొదగబడి చంద్రసకలంతో నిర్మించబడిన పక్షి గూడులా కనిపిస్తుంది అది ఉషః కాల ప్రకాశంతో చిత్రవిచిత్ర వర్ణాలతో ప్రకాశిస్తూ ఉన్నది కదా తల్లీ ,!
                   ***🪷****
🪷 తాయారు 🪷

కామెంట్‌లు