సౌందర్యలహరి🪷; - కొప్పరపు తాయారు
 🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟

నఖానాముద్ద్యోతైర్నవనలినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే ।
కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం
యది క్రీడల్లక్ష్మీచరణతలలాక్షారసఛణమ్ ॥ 71 ॥

సమం దేవి స్కందద్విపవదనపీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్ ।
యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి ॥ 72 !!
71) అమా!పార్వతి దేవి! అప్పుడే వికసించిన కమలాల కాంతిని పరిహసించే మీ చేతుల కాంతిని ఎలా వర్ణించేది ? కమలములు కమలాలయములు
అయినటువంటి లక్ష్మీదేవి పాదాల యందు లత్తుక రసము తో కలసి అరుణిమ కాంతిని పొందితే కొద్దిగా పోల్చవచ్చునేమో కదా ! తల్లీ!

72) అమ్మా! సకల జీవులకు ఆకలి బాధకి తీర్చే కరుణామయీ! బాల గణపతి నీ ఒడిలో పడుకొని పాలు తాగుతూ తన కుంభస్థలం అమ్మ దగ్గరే ఉందా ఏమిటి? అని ఆలోచిస్తూ చూసుకుంటున్న బాల గణపతిని చూసి మీరిద్దరూ నవ్వుకుంటున్నారు. కుమారస్వామి గణపతి యొక్క క్షుద్బాధ తీర్చిన తల్లీ నీ అపారమైన కరుణ మా దుఃఖాలను దూరం చేయాలని కోరుకుంటున్నాను తల్లీ!
                   ***🪷****
🌟కె.కె.తాయారు

కామెంట్‌లు