సుప్రభాత కవిత ; - బృంద
 మనసులోన దాచలేక
మధనపడ్డ మమతలేవో 
కనుల చివర కమ్మని
కాంతులై విరిసినట్టు...

కనుల మెరుపులు ఆపాలని
కఠిన యత్నం చేసినా
పెదవంచున నవ్వులై 
మెరుపులా మెరిసినట్టు....

పెక్కుకలతలు ఒక్కటై
చిక్కుముడులై తోచనపుడు
ఒక్కసారిగ మనసంతా 
దేనికదే విడిపోయినట్టూ...

మర్మమెరుగని మాయలేవో
చుట్టుముట్టి కట్టడి చేస్తే
చూపుకందని శక్తి ఏదో చేయూతనిచ్చినట్టూ...

కదిలిపోయే కఠిన సమయం
వదిలిపోయే గురుతులన్నీ
అనుభవాలై  బ్రతుకుదారి
సుగమం చేసినట్టూ...

అంబరాన అల్లదిగో
తొలివేకువ వెలుగులన్ని
అంతకంతకూ పెరుగుతూ
తోసుకువస్తున్న పసిడి పొద్దుకు

🌸🌸 సుప్రభాతం🌸🌸 మనసులోన దాచలేక
మధనపడ్డ మమతలేవో 
కనుల చివర కమ్మని
కాంతులై విరిసినట్టు...

కనుల మెరుపులు ఆపాలని
కఠిన యత్నం చేసినా
పెదవంచున నవ్వులై 
మెరుపులా మెరిసినట్టు....

పెక్కుకలతలు ఒక్కటై
చిక్కుముడులై తోచనపుడు
ఒక్కసారిగ మనసంతా 
దేనికదే విడిపోయినట్టూ...

మర్మమెరుగని మాయలేవో
చుట్టుముట్టి కట్టడి చేస్తే
చూపుకందని శక్తి ఏదో చేయూతనిచ్చినట్టూ...

కదిలిపోయే కఠిన సమయం
వదిలిపోయే గురుతులన్నీ
అనుభవాలై  బ్రతుకుదారి
సుగమం చేసినట్టూ...

అంబరాన అల్లదిగో
తొలివేకువ వెలుగులన్ని
అంతకంతకూ పెరుగుతూ
తోసుకువస్తున్న పసిడి పొద్దుకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు