'హరీ!'శతకపద్యాలు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 24.
చంపకమాల.
బుడి బుడి పాదముల్ గలిపి పొంపిరి వోవుచు గొల్చ విశ్వమున్ 
జడిసిరి రక్కసుల్ గురిసె ఝల్లని దివ్య సుగంధ పుష్పముల్ 
పడిపడి గాంచి మ్రొక్కిరట భారము దీర సురోత్తముల్ సదా 
నుడివెద నీదు లీలలను నోములు జేసి నుతింతు నో హరీ !//
25.
చంపకమాల.
శిలలకు ప్రాణమిచ్చెదవు చేతన నొంది యహల్య మ్రొక్కి తాన్
గలిసెను భర్త గౌతముని కన్నుల బాష్పము లుప్పతిల్ల నే
తలచెద నీదు గాథలను దల్చిన బాపము భస్మ మౌను నా
కులమును బ్రోవవయ్య!నిను గోపులు పెట్టి నుతింతు శ్రీహరీ!//

కామెంట్‌లు