శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
286)సురేశ్వరః -

దేవతలకు ప్రభువైనట్టివాడు
ఈశ్వర తత్వమున్నవాడు 
దేవగణ అధిపతియైనవాడు 
వారికి ఆజ్ఞలిచ్చునట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
287)ఔషధం-

భవరోగాలను బాపునట్టివాడు
ఔషధము తానైనట్టివాడు
స్మరణమూ తరింపజేయువాడు
ఉపశమనం కలిగించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
288)జగతస్సేమః -

ప్రపంచక్షేమమెరిగినవాడు
పరమాత్మకు వంతెనగువాడు
అంతర్యామిని చేర్చువాడు
జగత్తుకు వారధియగువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
289)సత్యధర్మపరాక్రమః -

సత్యము తానైనట్టివాడు
ధర్మరక్షణము చేయువాడు
పరాక్రమము కలిగినవాడు 
ధర్మాతిక్రమణసహించనివాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
290) భూతభవ్య భవన్నాదః 

జీవులచే ప్రార్థింపబడువాడు
మూడుకాలాల్లో స్మరింపబడువాడు
భవ్యమైన కీర్తిగడించినవాడు
నిత్యమూ మొక్కులందుకొనువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు