కళ్ళకు!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
కళ్ళకు అప్పుడప్పుడు
రాళ్లు కాదు-పూలు కనబడాలి!!

కళ్ళకు అప్పుడప్పుడు
కన్నీళ్లు కాదు-నీళ్లు కనబడాలి!!!

కళ్ళకు అప్పుడప్పుడు
భూతాలు కాదు-పంచభూతాలు కనబడాలి.

కళ్ళకు అప్పుడప్పుడు
మందిరం కాదు-సహజ సౌందర్యం కనబడాలి.!!

కళ్ళకు అప్పుడప్పుడు
సహజ ప్రకృతి కాదు-నూతన
కృత్రిమ లోకము కనబడాలి!!

కళ్ళకు అప్పుడప్పుడు
కదలని సముద్రం కాదు-పారే
నదులు జలపాతాలు కనబడాలి.!!!

కళ్ళకు అప్పుడప్పుడు
ఎర్రని ఎరుపు రంగే కాదు-ఆకు పచ్చని
పచ్చిక బయల్లు కనబడాలి!!!!

కళ్ళకు అప్పుడప్పుడు
సూర్యోదయం సూర్యాస్తమయాలే కాదు-
చంద్రోదయాలు కనబడాలి!!!!?

కళ్ళకు అప్పుడప్పుడు
చిమ్మ చీకటే కాదు-
వెన్నెల - వెలుగులు  కనపడాలి!!!

కళ్ళకు అప్పుడప్పుడు
శ్రీ లు కాదు-స్త్రీలు కనబడాలి!!!!

 అప్పుడు కళ్ళు మూసిన 
కళ్ళు తెరిచిన కన్నీళ్లు రావు!!!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు