వృద్ధాప్యపు పులి ఎదుట నిలబడింది
దూకుతున్నానంటూ భయపెడుతోంది
కొందరు స్నేహితులపై ముందే దూకింది
వారు పాపం "గదిలోమంచమె ఎల్లలోకమగుచున్"
ఇక కాలగణనలో ఉన్నారు
కనబడక కొందరు వినబడక ఇంకొందరు
చలిజ్వరం వచ్చినోళ్ళలా
వణికి పోతున్నారు మరికొందరు
కొంతమంది
ఈ పులికి ఎక్కువ భయపడ్డారేమో
యౌవనంలోనే తనువు చాలించారు
అయినా…….,
యౌవనంలో అనురాగాల పులి
ఇప్పుడు అన్నిరోగాల పులి
మనల్ని వేటాడుతూనేవుంది వెంటాడుతూనేవుంది
అదుగో మిత్రమా!
కాలుని దున్నపోతు మెడగంటలమోత వినబడుతోంది
మందు-మాకులు పూజలు-వ్రతాలు
మంత్రాలూ-తంత్రాలూ ఇక చాలు
కోటిప్రయత్నాలు చేసినా
కాలముచెల్లగానే కాటికిచేరక తప్పదు
పుట్టిన ప్రతిప్రాణీ గిట్టటం తెలిసికూడా
చింతించడం ఎంత వెర్రితనమో కదా!
ఎంతటి భాగ్యవంతుడైనా గుణవంతుడైనా
సుందరుడైనా యుక్తిపరుడైనా
కులీనుడైనా బడుగైనా
కాలుని పాశము విడిచిపెడుతుందా?
అందుకే మిత్రమా!
సర్వభూతాలపట్ల దయతో అనురాగంతో
ధర్మమార్గంలో నడుద్దాం
దైవంపై భారమేద్దాం!
నిర్మలమైన మనసుతో
దీనులను అభాగ్యులను సేవిద్దాం!
వృద్ధాప్యం, మరణం
అనివార్యం మిత్రమా!!
**************************************
దూకుతున్నానంటూ భయపెడుతోంది
కొందరు స్నేహితులపై ముందే దూకింది
వారు పాపం "గదిలోమంచమె ఎల్లలోకమగుచున్"
ఇక కాలగణనలో ఉన్నారు
కనబడక కొందరు వినబడక ఇంకొందరు
చలిజ్వరం వచ్చినోళ్ళలా
వణికి పోతున్నారు మరికొందరు
కొంతమంది
ఈ పులికి ఎక్కువ భయపడ్డారేమో
యౌవనంలోనే తనువు చాలించారు
అయినా…….,
యౌవనంలో అనురాగాల పులి
ఇప్పుడు అన్నిరోగాల పులి
మనల్ని వేటాడుతూనేవుంది వెంటాడుతూనేవుంది
అదుగో మిత్రమా!
కాలుని దున్నపోతు మెడగంటలమోత వినబడుతోంది
మందు-మాకులు పూజలు-వ్రతాలు
మంత్రాలూ-తంత్రాలూ ఇక చాలు
కోటిప్రయత్నాలు చేసినా
కాలముచెల్లగానే కాటికిచేరక తప్పదు
పుట్టిన ప్రతిప్రాణీ గిట్టటం తెలిసికూడా
చింతించడం ఎంత వెర్రితనమో కదా!
ఎంతటి భాగ్యవంతుడైనా గుణవంతుడైనా
సుందరుడైనా యుక్తిపరుడైనా
కులీనుడైనా బడుగైనా
కాలుని పాశము విడిచిపెడుతుందా?
అందుకే మిత్రమా!
సర్వభూతాలపట్ల దయతో అనురాగంతో
ధర్మమార్గంలో నడుద్దాం
దైవంపై భారమేద్దాం!
నిర్మలమైన మనసుతో
దీనులను అభాగ్యులను సేవిద్దాం!
వృద్ధాప్యం, మరణం
అనివార్యం మిత్రమా!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి